లగడపాటి ఫిట్టింగ్: ఆంధ్ర లాయర్ల బాహాబాహీ, ఘర్షణ

ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల న్యాయవాదులు మంగళవారం సమావేశానికి హాజరయ్యారు. ఆందోళన వల్ల యువ న్యాయవాదులు ఉపాధి కోల్పోతున్నారని, క్లయింట్లకు ఇబ్బంది కలుగుతోందని, అందువల్ల ఆందోళన విరమించాలని ఒక వర్గం వాదించగా, మరో వర్గం ఆ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. హైకోర్టు వద్ద తెలంగాణ లాయర్ల ఆందోళన హింసాత్మకంగా మారడం వల్లనే ప్రభుత్వం దిగి వచ్చిందని, ఆందోళన చేయకపోతే డిమాండ్ ను నెరవేర్చుకోవడం సాధ్యం కాదని ఓ వర్గం అభిప్రాయపడుతోంది. ఈ స్థితిలో సమావేశం రసాభాసగా మారడంతో భోజన విరామం కోసం సమావేశాన్ని వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications