19న హైదరాబాద్ కు మొయిలీ రాక: పిసిసి అధ్యక్షుడి మార్పునకేనా?

కాగా, కాంగ్రెస్ పార్టీ 125వ వార్షికోత్సవ ముగింపు కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తెలిపారు. నవంబర్ 14 నుంచి 19 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. సీఎం రోశయ్యతో కలసి జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు పీసీసీ సమన్వయకర్తలతో మంగళవారం గాంధీభవన్‌లో డీఎస్ భేటీ అయ్యారు. ఈ నెల 14వ తేదీన హైదరాబాద్‌లో ముగింపు వేడుకలకు సంబంధించి ప్రారంభ కార్యక్రమం ఉంటుందని అదే రోజు అన్ని జిల్లాల్లో విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన తదితర పోటీలు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. 15న రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం ఉంటుందని మరుసటి రోజు హైదరాబాద్‌లో శాంతి ర్యాలీ ఉంటుందని వెల్లడించారు. పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులంతా విధిగా ఈ సమావేశాల్లో పాల్గొనాలని డీఎస్ కోరారు.












Click it and Unblock the Notifications