కెసిఆర్ తో ఇబ్బంది లేదు: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

తెలంగాణ కోసం భాజపా ఆధ్వర్యంలో డిసెంబర్ 9వ తేదిన ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి చిదంబరం ఇంటిని ముట్టడిస్తామని చెప్పారు. హైదరాబాద్ లేకుండా తెలంగాణను ఆమోదించేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో హైదరాబాద్ ఒక ప్రాంతమని చెప్పారు. తెలంగాణ వచ్చే వరకు భాజపా ఉద్యమిస్తుందన్నారు.
సీమాంధ్ర ప్రజలు తెలంగాణకు వ్యతిరేకంగా లేరని ఆయన అన్నారు. స్వప్రయోజనాలకే పెద్దపీట వేసే రాజకీయనాయకులు మాత్రమే తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పారు. తెలంగాణ సాధించే వరకు ఐక్యకార్యాచరణ సమితి(జెఏసి)లో కొనసాగుతామని ఆయన అన్నారు. 2014 ఎన్నికలే లక్ష్యంగా భాజపా పని చేస్తుందన్నారు.












Click it and Unblock the Notifications