పోలవరం ప్రాజెక్టులో జాప్యంపై ఆంధ్ర కాంగ్రెసు ఎంపీలు గరం

పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వడంలో కొన్ని ముళ్లున్నాయని, ఆ ముళ్లు తొలగిపోతాయని జెడి శీలం అన్నారు. కాగా, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే ప్రక్రియ కొనసాగుతోందని, గత 30 ఏళ్లలో ఏ ప్రాజెక్టుకు కూడా దేశంలో జాతీయ హోదా ఇవ్వలేదని, ఈ స్థితిలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే ప్రక్రియ వెంటనే కావడం అంత సులభం కాదని కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ అన్నారు. జాతీయ హోదా లభిస్తే కేంద్రం నుంచి ప్రాజెక్టుకు 15 వేల కోట్ల రూపాయలు వస్తాయని, అలా వస్తే దేశంలోనే అలా సాధించిన ఘనత తమకు దక్కుతుందని ఆయన అన్నారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు రెండేళ్లలో అన్ని అనుమతులు వస్తాయని, అప్పుడు దానికి జాతీయ హోదా కల్పించే ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications