బాలయ్యపై కామెంట్స్ పై తీవ్ర వ్యాఖ్యలు: ఏడ్చేసిన లక్ష్మీపార్వతి

ఎన్టీఆర్ తలుచుకుంటే ఎంతటివారైనా, ఎంతమందైనా వచ్చి వాలేవారని ఆమె చెప్పారు. అటువంటి సందర్బంలో కుమారులు ఎన్టీఆర్ కు తిండి కూడా పెట్టలేదని ఎలా అంటానని ఆమె అన్నా సోమిరెడ్డి చంద్రమోహన్ వినలేదు. ఎన్టీఆర్ కుమారులపై ఆరోపణలు చేయడానికి వైయస్ జగన్ డబ్బులిచ్చారని ఆయన లక్ష్మీపార్వతిపై ఆరోపణ చేశారు. చంద్రమోహన్ రెడ్డి టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టడంతో లక్ష్మీపార్వతి ఏడ్చేసినంత పని చేశారు. ఇక నుంచి ఎన్టీఆర్ కుమారులపై గానీ మీలాంటి నాయకులపై గానీ తాను విమర్శంచబోనని లక్ష్మీపార్వతి ఓ రాజీ ఫార్ములాను ముందు పెట్టారు. మరింతగా ఇబ్బంది పడే స్థితి నుంచి బయటపడడానికి ఆమె ఈ రాజీ ఫార్ములాను ముందుకు తెచ్చారు.












Click it and Unblock the Notifications