తెలంగాణలో పార్టీ ఇన్ ఆక్టివ్ గానే ఉంది: ఒప్పుకున్న చిరంజీవి

ప్రజారాజ్యం పార్టీలో క్రమశిక్షణ ఎక్కడకు పోలేదని, అందరూ బాగానే ఉన్నారని చెప్పారు. అయితే కొన్ని వివాదాలు పార్టీ అంతర్గత చర్చించుకొని పరిష్కరించుకునేవిగా ఉంటాయని, వాటని బహిర్గతం చేయటం మంచిది కాదని వంగవీటి రాధాను ఉద్దేశించి అన్నారు. అయితే ఆయన మాట్లాడినది పార్టీ క్రమశిక్షణారాహిత్యం కిందకు రాదని చెప్పారు. పార్టీపై మాట్లాడితే విచారించడానికి క్రమశిక్షణా సంఘం ఉందన్నారు. పార్లమెంటు సభ్యులు కేంద్రం నుండి రాష్ట్రానికి నిధులు తేవటంలో విఫలమయ్యారన్నారు. మా పార్టీలో ఎంపీలు లేనందువల్లనే వారిని నిధులు తెమ్మని అడుగుతున్నామన్నారు. మా పార్టీలో ఒక్క పార్లమెంటు సభ్యుడు ఉన్నాకూడా నిధులు తెప్పించి ఉండేవాడినేమోనన్నారు. పక్క రాష్ట్రాల ఎంపీలకు, మన రాష్ట్రాల ఎంపీలకు తేడా గమనించాలని సూచించారు. నేను ప్రజాప్రతినిధిని కాబట్టి ప్రభుత్వాన్ని సమస్యలపై నిలదేసే అధికారం ఉంటుందన్నారు.
ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవటంలో విఫలమయిందని విమర్శించారు. ఇప్పటికై ప్రభుత్వం వారిపై శ్రద్ధ చూపాలని సూచించారు. వరద బాధితుల అరోగ్యం కోసం వైద్యులను, ఉండటం కోసం పునరావాస కేంద్రాలను, తినటం కోసం బియ్యం, కందిపప్పు వంటి రేషన్ ఇవ్వాలని డిమాంట్ చేశారు. రైతులకు పంట నష్టాన్ని అంచనా వేసి వెంటనే ఇవ్వాలని కోరారు. తుపాను వల్ల నష్టపోయిన వారికి ఇండ్లు కట్టించి ఇవ్వాలన్నారు. కాగా సినిమాల గురించి ఇప్పుడు మాట్లాడటానికి సమయం కాదని చిరంజీవి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.












Click it and Unblock the Notifications