ఆర్ఎస్ ఎస్ కు సాధన ఎక్కువ, కాంగ్రెసుకు వాదన ఎక్కువ: కోట

మహబూబ్ నగర్లోని ధర్నాలో కోట శ్రీనివాస రావు పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాడు. కాషాయం తిరగబడితే కొట్టుకుపోతారు. గుర్తుంచుకోండి అని కాంగ్రెసు ని హెచ్చరించారు. ఆర్ఎస్ఎస్ వంటి దేశభక్తి కలిగిన ఒక వ్యవస్థని ఉగ్రవాదిగా ప్రచారం చేస్తే నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు.దేశభక్తిగల ఆర్ఎస్ఎస్ కు దేశద్రోహం తలపెట్టే టెర్రరిస్టులకు కాంగ్రెస వారికి, ముఖ్యంగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు తేడా తెలియకపోవటం విచారకరమని పలువురు భాజపా నాయకులు పేర్కొన్నారు. సిమితో ఆర్ఎస్ఎస్ ను పోల్చి రాహుల్ గాంధీ తనకు మిడిమిడి జ్ఞానం ఉందని నిరూపించుకున్నాడన్నారు. ఆయా జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లాలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్ పేట శాసనసభ్యుడు కిషన్ రెడ్డి, మాజీ భాజపా అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ, సినీనటుడు కోట శ్రీనివాసరావు, ఆలె నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications