హైటెక్కు బాబు టక్కు టమారామా?: దుమ్మెత్తిపోసిన సాక్షి

Sakshi Daily
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ విధానంపై కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన సాక్షి దినపత్రిక దుమ్మెత్తిపోసింది. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయం దండుగ అని వ్యాఖ్యానించిన చంద్రాబాబు ఇప్పుడు రైతుల కోసం పోరాటం చేయడంపై ప్రశ్నల వర్షం కురిపించింది. హైటెక్కు బాబు టక్కు టమారమంటూ పతాక శీర్షికన ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. వ్యవసాయానికి వ్యతిరేకంగా చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాల జాబితాను ఇచ్చింది. అదే సమయంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల మేలు కోసం తీసుకున్న నిర్ణయాల జాబితాను కూడా ఇచ్చింది. రైతులకు, వ్యవసాయానికి వ్యతిరేకంగా చంద్రబాబు తీసుకున్న 21 నిర్ణయాలను సాక్షి డైలీ క్రోడీకరించింది. రైతులకు, వ్యవసాయానికి అనకూలంగా వైయస్ రాజశేఖర రెడ్డి తీసుకున్న 21 మంచి నిర్ణయాలతో వాటిని పోల్చింది.

చంద్రబాబు రైతుల కోసం తాను పోరాడుతానంటున్నారని, వరదల ప్రాంతాల్లోకి వెళ్లి అన్నదాతలపై అపారప్రేమను కురిపిస్తున్నారని, కానీ సగటు రైతు మాత్రం పాత విషయాలను మరవలేదని, వ్యవసాయం వల్ల ఒనగూరేదేమీ ఉండదన్న చంద్రబాబు పాలనను, వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన వైఎస్ పాలనతో పోల్చుకుంటున్నారని సాక్షి వ్యాఖ్యానించింది. కరెంటు చార్జీలు తగ్గించాలని, మద్దతు ధరలు కావాలని అడిగినవారిపై క్రూరంగా కాల్పులు జరిపిన బాబును తలుచుకుంటేనే ఇప్పుడు రాష్ట్రంలోని రైతుల గుండెల్లో బాంబులు పేలుతున్నాయని, కరువుతో పొలాల్లో నెర్రెలు వచ్చి రైతు దుఃఖటిల్లినా రుణాల మీదా వడ్డీ మాఫీ విషయాన్ని ఆలోచించని బాబు ఇప్పుడు పావలావడ్డీ మీద మాట్లాడుతుండడంపై నివ్వెరపోతున్నారని సాక్షి విమర్శించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+