సోనియా గాంధీకి ఫిర్యాదు: వైయస్ జగన్ పై పెరుగుతున్న ఒత్తిడి

YS Jagan
న్యూఢిల్లీ: తమ పార్టీ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై కాంగ్రెసులోని కొంత మంది నాయకులు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదు చేశారు. నెల్లూరులో జరిగిన ఓదార్పు యాత్ర ముగింపు సభలో వైయస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై వారు సోనియాకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. వైయస్ జగన్ చర్యలు పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉన్నాయని వారు చెప్పినట్లు తెలుస్తోంది. తాను సహనం కోల్పోతే ఉప్పెన పుడుతుందని, శిశుపాలుని తప్పుల్లా తమ కాంగ్రెసు పార్టీ నాయకుల తప్పులు పెరిగినప్పుడు తనలో సహనం నశిస్తుందని జగన్ అన్న విషయం తెలిసిందే. తనను పార్టీలో ఒంటరి చేసే కుట్ర జరుగుతోందని అంటూ తనతో పాటు ఓదార్పు యాత్రలో పాల్గొంటున్నవారిపై చర్యలు తీసుకోవడంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు సోనియాకు జగన్ పై ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది.

తనపై సోనియాకు ఫిర్యాదు చేయడం, తన అనుచరుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై చర్యకు పార్టీ నాయకత్వం సిద్ధపడడం వంటి కారణాలతో వైయస్ జగన్ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు తెలుస్తోంది. ఓదార్పు యాత్రలో పాల్గొంటున్న నాయకులు తమ పరిధిలోకి వచ్చేవారయితే, వారిపై పిసిసి వెంటవెంటనే చర్యలు తీసుకుంటోంది. మరోవైపు, ఎఐసిసి సభ్యురాలు కొండా సురేఖను అధిష్టానం పక్కన పెట్టినట్లే. కొండా సురేఖను, మారెప్పను ఎఐసిసి సదస్సుకు ఆహ్వానించకపోవడాన్ని బట్టి వైయస్ జగన్ కు అధిష్టానం వ్యతిరేకంగానే ఉందనే విషయం స్పష్టమైంది. ఓదార్పు యాత్ర ద్వారా దీర్ఘ కాలం సాగి, ఆ తర్వాత తన నిర్ణయాన్ని ప్రకటిద్దామని భావించిన వైయస్ జగన్ కు అంతకన్నా ముందుగానే చెక్ పెట్టేందుకు పార్టీ అధిష్టానం సమాయత్తమవుతున్నట్లు కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+