అలా అనుకుంటే ఎలా, ఎవరికి దగ్గరుకుంటే వారికి ఇస్తామా : వికె దుగ్గల్

పార్లమెంటు సమావేశాల తర్వాత మరోసారి తాము హైదరాబాద్ వస్తామని ఆయన చెప్పారు. తాము నివేదిక తయారీలో చాలా బిజీగా ఉన్నామని ఆయన చెప్పారు. నాలుగు ప్రధానాంశాలపై తాము నిపుణలు కమిటీలు వేశామని ఆయన అన్నారు. హైదరాబాద్ తమ అధ్యయనంలో ప్రధానాంశమని, అది ప్రధానాంశమని కమిటీకి తెలుసునని, అందుకే హైదరాబాద్ అభివృద్ధిపై అధ్యయనానికి ప్రతాప్ మను మెహతా నేతృత్వంలో ప్యానెల్ వేశామని ఆయన చెప్పారు. తాము నాలుగు ప్యానెళ్లు వేశామని చెప్పారు. నీటి పారుదుల, వ్యవసాయం, ఉద్యోగాలు, హైదరాబాద్ అభివృద్ధిపై ఆ ప్యానెళ్లు అధ్యయనం చేసి తమకు నివేదిస్తాయని ఆయన చెప్పారు. తాము డిసెంబర్ 31లోపల ఎట్టి పరిస్థితిలోనూ నివేదిక ఇస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications