మరో చెన్నారెడ్డిగా మారద్దు: కెసిఆర్ కు నాగం జనార్దన్ రెడ్డి సలహా

కెసిఆర్ తెలంగాణ ఉద్యమాన్ని వదిలేసినా తాము ముందుకు నడిపిస్తామని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన విధివిధానాలను తాము ప్రకటిస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనే తన ప్రాధాన్యత అని చెప్పుకున్న కెసిఆర్ ప్రాధాన్యత మారిందని ఆయన అన్నారు. కాంగ్రెసును బలోపేతం చేయడమే కెసిఆర్ ప్రస్తుత ప్రాధాన్యత అని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం పోరాటం సాగిస్తానని చెప్పిన కెసిఆర్ కాంగ్రెసు వద్ద మోకరిల్లారని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు వద్ద ఎందుకు మోకరిల్లారో కెసిఆర్ ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications