మా నియోజకవర్గాల్లో మంత్రుల జోక్యమా!: మంత్రులపై సింఎంకు మొర

రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లా నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఈ యువ కాంగ్రెసు ఎమ్మెల్యేలు కొందరు తమ నియోజకవర్గాల్లో మంత్రులు, సీనియర్ నేతల జోక్యాన్ని వారు ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్నారు. స్థానిక మార్కెట్ కమిటి నియామకాలతో పాటు పలు విషయాల్లో తమకున్న సమస్యలను వారు విన్నవించుకున్నారు. మంత్రులు అన్ని విషయాల్లోనూ తమ అనుయాయులకే ప్రాధాన్యం ఇస్తున్నట్టు చెప్పారు.మంత్రుల వ్యవహారశైలిపై కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఎమ్మెల్యేలకు నియోజకవర్గ కేంద్రాల్లో కార్యాలయాలు, ఇంటిభత్యం పెంపు తదితర అంశాలపై వారు ముఖ్యమంత్రితో చర్చించారు.












Click it and Unblock the Notifications