వైయస్ తెలంగాణ ద్రోహి: కాంగ్రెసు నాయకుడు దామోదర్ రెడ్డి

R Damodar Reddy
వరంగల్: వరంగల్ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ ద్రోహి అని మాజీమంత్రి, కాంగ్రెసు నాయకుడు దామోదర్ రెడ్డి ధ్వజమెత్తారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణకు వ్యతిరేకంగా ఉండేవారని, అందుకే ఆయన పోటో తెలంగాణ మృతవీరుల సంస్మరణ దిన సభలలో పెట్టవద్దని నిర్ణయించుకున్నామని తెలిపారు. వైయస్ఆర్ తెలంగాణను ఎప్పుడూ వ్యతిరేకించారన్నారు.

గత శాసనసభ ఎన్నికలలో సైతం ఆయన తెలంగాణలో పోలింగ్ అయిపోగానే సీమాంధ్ర ప్రాంతంలో తెలంగాణకవ వ్యతిరేకంగా మాట్లాడారన్నారు. కర్నూల్ సభలో తెలంగాణకు వెళ్లాలంటే వీసాలు కావాలా అంటూ ప్రశ్నించి ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకున్నారన్నారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ రెడ్డి కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పార్లమెంటులో ఫ్లకార్డులు ప్రదర్శించిన విషయాన్ని గుర్తు చేశాడు. అయితే ఇప్పటికైనా జగన్ తెలంగాణకు అనుకూలమని బహిరంగంగా ప్రకటిస్తే వైయస్ ఫోటో పెట్టడానికి సిద్ధమని ప్రకటించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+