నటుడు ఫిరోజ్ ఖాన్ భూమిని కొట్టేసిన కర్ణాటక సిఎం యడ్యూరప్ప

BS Yeddyurappa
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప బాలీవుడ్ పాత తరం నటుడు, నిర్మాత, దర్సకుడు ఫిరోజ్ ఖాన్ కు చెందిన భూమిని కొట్టేశారు. యడ్యూరప్ప, ఆయన కుమారులు రాఘవేంద్ర, విజయేంద్ర కలిసి ఫిరోజ్ ఖాన్ కు చెందిన భూమిని కబ్జా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఫిరోజ్ ఖాన్ అత్యంత ముఖ్యమైన పారిశ్రామిక ప్రాతం జిగాని ఒకటో దశలో తనకు 1982లో కేటాయించిన స్థలాన్ని కోల్పోయారు. ఆ భూమిని కర్ణాటక పారిశ్రామిక ప్రాంతాభివృద్ధి బోర్డు స్వాధీనం చేసుకుని, యడ్యూరప్ప కుమారులు 2007లో స్థాపించిన ఫ్లూయిడ్ పవర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కేటాయించింది.

బెంగళూరుకు చెందిన ఖాన్ తొలుత ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి ఉంటుందనే ఉద్దేశంతో తన భూమి కోల్పోయినా చాలా కాలం ఏమీ మాట్లాడలేదు. ఆ భూమిని యడ్యూరప్ప కుమారులకు కేటాయించరనే విషయం వెలుగులోకి రావడంతో వివాదం చెలరేగింది. శక్తివంతమైన రాజకీయ నేతలపై పోరాటం చేయలేక ఆయన స్థానిక కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఫిరోజ్ ఖాన్ స్థాపించిన సూపర్ కాస్ట్ అండ్ మల్లియెబుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అప్పటి ముఖ్యమంత్రి ఆర్ గుండూరావు 9 ఎకరాల స్థలాన్ని కేటాయించారని, 2007లో యడ్యూరప్ప ఉప ముఖ్యమంత్రి కాగానే ఏ పరిశ్రమనూ స్థాపించలేదనే కారణంతో ఆ స్థలాన్ని బోర్డు ద్వారా స్వాధీనం చేసుకునే ఏర్పాట్లు చేశారని, దాంట్లో రెండెకరాల స్థలాన్ని యడ్యూరప్ప కుమారులకు కట్టబెట్టారని ఫిరోజ్ ఖాన్ న్యాయవాది చెప్పారు. కేటాయించి రెండేళ్లు పూర్తయినా ఏ విధంగానూ అభివృద్ధి చేయలేదని, అందుకే ఫిరోజ్ ఖాన్ నుంచి భూమిని స్వాధీనం చేసుకున్నామని కర్ణాటక పారిశ్రామిక ప్రాంతాభివృద్ధి బోర్డు అధికారులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+