వైయస్ జగన్ జగతి పబ్లికేషన్స్ పై ఆదాయం పన్ను శాఖ కన్ను

ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్‌లో ప్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసిన ప్రముఖులలో ప్రభుత్వ సలహాదారు కేవీపీ రామచంద్రరావు సతీమణి కోటగిరి సునీత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కోడలు బ్రహ్మణి, మంత్రి గల్లా అరుణకుమారి, సినీ హీరో కృష్ణ, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, వైఎస్ సోదరుడు సుధీకరరెడ్డి సతీమణి విద్యారెడ్డి తదితర ప్రముఖులు ఉన్నారు. ఇక్కడ చదరపు గజం స్థలం రూ.40 వేల వరకు ఉండగా..డాక్యుమెంట్లలో మాత్రం రూ.5 వేలుగా చూపారు. వైఎస్ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్‌పైనా ఆదాయపు పన్ను శాఖ దృష్టి సారించింది. జగతిలో పెట్టుబడులు పెట్టిన వారెవరు? ఎంత మేరకు పెట్టారు? వారి ఆస్తుల వివరాలేంటి? అనే అంశాలపై ఆరా తీస్తోంది. పైకి దమ్మిడి ఆదాయం లేని కొన్ని కంపెనీలు జగతి సంస్థలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. పొట్లూరి వరప్రసాద్ (మారిషస్)కు చెందిన పీవీపీ వెంచర్స్, క్యూబైడ్, పీవీపీ బిజినెస్ టవర్స్ సంస్థలు జగతిలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. తమ బ్యాలెన్స్ షీట్లలో నష్టాలున్నప్పటికీ కోట్లాది రూపాయలను కుమ్మరించాయి.












Click it and Unblock the Notifications