జగన్ కారణంతో మాపై వివక్ష చూపిస్తున్నారు: కొండా మురళి

Konda Murali
వరంగల్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహనరెడ్డిని తాము అభిమానిస్తున్నందువల్లనే తమను ఉద్దేశ్యపూర్వకంగా ప్రభుత్వం పక్కన పెడుతోందని శాసనమండలి సభ్యుడు(ఎమ్మెల్సీ) కొండా మురళీధరరావు ఆరోపించారు. సోమవారం ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య వరంగల్లులో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. ఆయా శిలాపలకాల్లో తన పేరు లేకపోవటంపై ఆయన మండిపడ్డారు. కొండా మురళీ జగన్ వర్గం కాంగ్రెస్ శాసనసభ్యురాలు కొండా సురేఖ భర్త.

ముఖ్యమంత్రి రోశయ్య నామినేటెడ్ శాసనమండలి సభ్యుడు అయితే నేను ఎన్నికయిన సభ్యుడిని అని కొండా మురళి ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన సందర్భంగా కొండా మురళీధరరావు ప్రోటోకాల్ వివాదం రేకెత్తించటంతో వరంగల్లో జగన్ వర్గం కాంగ్రెస్ కు, ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ కు విభేదాలు మరింత పొడసూపాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+