వాటా అడిగితే లాఠీఛార్జా!: డిజిపిపై హరీష్ రావు పైర్

కాగా ఎస్ఐ రాతపరీక్షలను వెంటనే రద్దు చేయాలంటూ ప్రభుత్వాన్ని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేసింది. తెలంగాణ పోస్టులను న్యాయపరంగానే అడుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. 14ఎఫ్ క్లాజును వెంటనే తొలగించాలని ఈ సందర్భంగా అఖిలపక్షం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మా ప్రాంతానికి అన్యాయం జరిగితే పోరాడి సాధించుకుంటామన్నారు. మాస్ కాపీయింగ్ కు, భారీ అక్రమాలకు ఎస్ఐ పరీక్షలు నిదర్శనమన్నారు.
సిద్దిపేట తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు మెదక్ లో ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణకు న్యాయమైన పోస్టులను అడిగితే లాఠీలతో కొట్టడమేమిటని ప్రశ్నించారు. విద్యార్థులపై లాఠీచార్జీకీ వెంటనే డిజిపి సమాధానం చెప్పాలన్నారు. హైదరాబాద్ ఫ్రీజోన్ కాదని శాసనసభ తీర్మానం చేసిందనీ, దానిని అమలు చేయటం చట్ట విరుద్ధమా అని ప్రశ్నించారు. కాంగ్రెసు నేతలు, శాసనసభ్యులు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications