చంద్రబాబు టార్గెట్: నాడు దేవేందర్ గౌడ్, నేడు నాగం జనార్దన్ రెడ్డి

నాగం జనార్దన్ రెడ్డిపైకి ఇప్పుడు తెలంగాణకు చెందిన దేవేందర్ గౌడ్, నామా నాగేశ్వర రావులను చంద్రబాబు ఉసిగొల్పుతున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో తెలంగాణకు పార్టీ అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని దేవేందర్ గౌడ్ గొంతెత్తినప్పుడు నాగం జనార్దన్ రెడ్డిని చంద్రబాబు ఎగేశారని అంటారు. ఒకరికి వ్యతిరేకంగా మరొకరిని వాడుకోవడం చంద్రబాబు వ్యూహంలో ఒక భాగమని చెబుతున్నారు. వారిద్దరిని ప్రయోగించి నాగం జనార్దన్ రెడ్డిని చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారని అంటున్నారు. పార్టీ సమావేశాల్లో నాగం జనార్దన్ రెడ్డికి వ్యతిరేకంగా తాను మాట్లాడడమే కాకుండా ఇతర నాయకుల చేత కూడా చంద్రబాబు మాట్లాడిస్తున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పాత్రలు అవే, నాటకం అదే, కానీ నటులే తారుమారయ్యారనే మాట వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications