వరంగల్ లో డిసెంబర్ 9వ తేదీన తెరాస తెలంగాణ మహా గర్జన

Telangana
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసి ఏడాది గడుస్తున్న నేపథ్యంలో డిసెంబర్‌ 9న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు 'తెలంగాణ మహాగర్జన' పేరును ఖరారు చేశారు. వరంగల్‌లో వెయ్యి ఎకరాల్లో దేశ ప్రజలను ఆకర్షించేలా దీన్ని నిర్వహించాలని, కనీసం 20 లక్షల మందిని రప్పించాలని, పార్టీ శ్రేణులన్నీ ఇప్పటి నుంచే ఏర్పాట్లలో నిమగ్నం కావాలని తెరాస నేతలు నిర్ణయించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. డిసెంబర్‌ 9న నిర్వహించనున్న బహిరంగ సభ గురించి ప్రధానంగా చర్చించారు. తెలంగాణలోని ప్రతి గ్రామం, తండా నుంచి జనం వచ్చేలా చూడాలని, దీని కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా కేసీఆర్‌ ఆదేశించారు.

సభ నిర్వహణ ఖర్చుల కోసం ఈనెల 24, 25వ తేదీల్లో కూలీ పనులు చేయాలని, దీంట్లో తాను కూడా పాల్గొంటానని, వచ్చిన సొమ్ముతో ఏర్పాట్లు చేద్దామని ఆయన సూచించారు. దీనికి నేతలంతా తమ అమోదం తెలిపారు. సభా ప్రాంగణానికి 'శ్రీకాంతాచారి ప్రాంగణం'గా నామకరణం చేశారు. ఇటీవల పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన పల్లెబాట కార్యక్రమం విజయవంతమైనట్లు కేసీఆర్‌ ప్రకటించారు. 60శాతం కమిటీల నిర్మాణం పూర్తయిందని, సుమారు ఏడు లక్షల మంది తెదేపాతోపాటు ఇతర పార్టీలకు రాజీనామా చేసి తెరాసలో చేరినట్లు చెప్పారు. తెలంగాణ ఏర్పాటు మలిదశకు చేరుకుందని, ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలని, వ్యూహాత్మకంగా వ్యవహరించాలని పార్టీ నాయకులకు ఉద్బోధించారు.ఎస్సై పోస్టుల భర్తీ వ్యవహారంలో ప్రభుత్వ అలసత్వంతోనే గందరగోళ పరిస్థితి ఏర్పడిందని కేసీఆర్‌ విమర్శించారు.

తెలంగాణలో జరగబోయే పరిణామాలకు, ప్రస్తుత గందరగోళానికి ముఖ్యమంత్రి, హోంమంత్రులే బాధ్యత వహించాలన్నారు. హైదరాబాద్‌ ఫ్రీజోన్‌ కాదని, ఇది ఆరో జోన్‌లో భాగమని ప్రభుత్వం శాసనసభలో తీర్మాన చేసిందని, దీన్ని అమలు చేయించడంలో నిర్లక్ష్యం చేసిందన్నారు. హైదరాబాద్‌ జోన్‌ పరిధిలోని పోస్టులకు మాత్రమే పరీక్షలు నిర్వహించబోమని ప్రభుత్వం చెబుతోందని, ఇది తమకు సమ్మతంకాదని చెప్పారు. తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆరు తీర్మానాలు చేసినట్లు నాయకులు విజయరామారావు, నాయిని నర్సింహారెడ్డి, మధుసూదనాచారి, కళ్లెం యాదగిరిరెడ్డి చెప్పారు. కరీంనగర్‌ జిల్లా నేదునూరులో 2100 మెగావాట్ల జెన్‌కో విద్యుత్‌ప్రాజెక్టుకు గ్యాస్‌ కేటాయించాలని, ఎస్సై పరీక్ష ప్రక్రియను నిలిపివేసి, ముఖ్యమంత్రి నేతృత్వంలో అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌ నుంచి తొలగించేలా ఒత్తిడి చేయాలని తీర్మానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+