నీతి లేని ఆంధ్రావాళ్లతో ఎలా కలిసి ఉంటాం?: కెసిఆర్ ప్రశ్న

సీమాంధ్ర విద్యార్థుల ఆందోళన తెలంగాణవాదాన్ని బలపరుస్తోందని ఆయన అన్నారు. ధర్మంగా, నిజాయితీగా అడిగితే న్యాయం జరిగే పరిస్థితి లేదని ఆయన అన్నారు. ఎస్సై రాత పరీక్షల కోసం ఓ 15 రోజులు ఆగితే సీమాంధ్ర విద్యార్థుల కొంపలు మునుగుతాయా అని ఆయన అడిగారు. హైదరాబాద్ ఫ్రీజోన్ విషయాన్ని ముఖ్యమంత్రి కె. రోశయ్యనే నాన్చారని ఆయన విమర్శించారు. సీమాంధ్ర రాజకీయ జెఎసి కన్వీనర్ శామ్యూల్, ఇతర సీమాంధ్ర నాయకులు దురహంకారంతో వ్యవహరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్టు మున్సిపల్ కార్మికులను క్రమబద్దీకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మున్సిపల్ ఉద్యోగుల క్వార్టర్ల కోసం తాము పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications