వైయస్ జగన్ సాక్షికి కాంగ్రెసు నేత వి హనుమంతరావు వార్నింగ్

V Hanumantha Rao
హైదరాబాద్: తమ పార్టీకి చెందిన కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన సాక్షి దినపత్రికకు, టీవీ చానెల్ కు కాంగ్రెసు సీనియర్ నాయకుడు వి హనుమంతరావు హెచ్చరికలు చేశారు. తమను కించపరిచే విధంగా వార్తలు ఇస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. వైయస్ జగన్ పై కూడా ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సాక్షి దినపత్రికను కొనవద్దని, సాక్షి టీవీ చానెల్ చూడవద్దని ఆయన కాంగ్రెసు కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెసు పాలనలో సంపాదించిన డబ్బుతో పత్రిక, చానెల్ పెట్టి కాంగ్రెసుకు, సోనియాకు వ్యతిరేకంగా వార్తలు ఇస్తారా అని ఆయన అడిగారు. సోనియాను, తమను విమర్శించడానికే పత్రిక పెట్టారా అని ఆయన వైయస్ జగన్ ను అడిగారు.

వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో పత్రిక పెడుతుంటే తామంతా సంతోషించామని, కాంగ్రెసుకు ఓ పత్రిక వస్తుందని అనుకున్నామని, కానీ కాంగ్రెసుకు, సోనియాకు వ్యతిరేకంగా వార్తలు రాయడానికి పెట్టినట్లు ఉందని ఆయన అన్నారు. యుపిఎ అంటేనే కుంభకోణాల ప్రభుత్వంగా మారిందని సాక్షి పత్రిక వ్యాఖ్యానించడంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. తొలుత తమకు, ముఖ్యమంత్రి రోశయ్యకు వ్యతిరేకంగా వార్తలు రాసిన సాక్షి దినపత్రిక ఇప్పుడు సోనియాకు వ్యతిరేకంగా రాస్తోందని ఆయన అన్నారు. వైయస్ జగన్ కుంభకోణాలను బయటపెట్టే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఆ కుంభకోణాలపై తాము ప్రత్యేకంగా ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదని, పార్టీ అధిష్టానానికి అన్నీ తెలుసునని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+