తెలంగాణకు ఆంధ్రా వైరస్ సోకింది: కె చంద్రశేఖర రావు

"హెల్త్ యూనివర్సిటీ ఏం ఖర్మ...ఎన్ని యూనివర్సిటీలైనా పెట్టుకుందాం" అన్నారు. ఉద్యమం చివరిదశలో ఉందని, తెలంగాణ వాదులంతా ఒక్కటై పిడికిలి బిగించి పోరాడాలని పిలుపునిచ్చారు. ఐక్యమత్యమే శ్రీరామ రక్ష అన్నారు. తెలంగాణ వస్తే తిరిగి మిగులు బడ్జెట్లోకి వస్తామని, ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వంతో సమానంగా వేతన స్కేళ్లు అమలు చేస్తామని ప్రకటించారు. తెలంగాణ వస్తే భూముల ధరలు తగ్గుతాయన్న ప్రచారాన్ని ఖండించారు. 125 కిలోమీటర్ల మేర అంతా ఆశ్చర్యపోయే రీతిలో హైదరాబాద్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతామన్నారు. మరో 'రీయో డీ జనీరో'గా మారుస్తామని చెప్పారు.
తెలంగాణ సమస్యల పట్ల తెలంగాణ శాసన సభ్యులకు చిత్తశుద్ధి లేదని కెసిఆర్ ఆరోపించారు. సమస్యలు పరిష్కరిస్తావా... గోచి గుంజమంటావా అని రోశయ్యను ఏనాడైనా నిలదీశారా? అని ప్రశ్నించారు. వైద్యులే బాధ్యత తీసుకొని, వైద్యానికి వచ్చే ప్రజలను కౌన్సిలింగ్ చేయాలని సూచించారు. 54 ఏళ్ల ఉద్యమంలో మొదటిసారి కేంద్రం దిగివచ్చి తెలంగాణ ప్రకటిస్తే ఆ సంతోషం 24 గంటలు కూడా దక్కనీయలేదని విమర్శించారు. ఆంధ్రా జీవులన్నీ ఒక్కటై బ్లాక్ మెయిల్ రాజకీయాలతో అడ్డుకున్నాయని ఆరోపించారు. భేషజాలు విడిచి పెట్టి జానారెడ్డి ఇంటికెళ్లి ఐకాస ఏర్పాటు చేశామని, రాజీనామాలు చేస్తామని శవాలమీద ప్రమాణం చేశామని, ఆంధ్రా నాయకుల అడుగులకు మడుగులొత్తి కొందరు వెనక్కి తగ్గారని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications