వైయస్సార్ ఆర్థికంగా హద్దులు దాటేవారు: ముఖ్యమంత్రి రోశయ్య

వ్యక్తిగా వైశ్యుల కోసం కృషి చేస్తానని, సీఎంగా రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తాను నిద్రలో కూడా అనుకోని పరిణామం నేపథ్యంలో, రాష్ట్రాన్ని పాలించాల్సిందిగా అధిష్ఠానం తనపై బాధ్యతలు మోపిందన్నారు. గత ఏడాది సెప్టెంబరు 3న రాష్ట్రంలోని 80 శాతం మండలాలు తీవ్ర దుర్భిక్షంలో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. వీటిని సరిదిద్దే పనుల్లో తలమునకలై ఉంటే అక్టోబరు నెలలో కృష్ణానదికి ఎంతటి వరదలు వచ్చాయో తెలిసిన విషయమేనన్నారు. క్షణం కూడా తీరిక లేకుండా తలమునకలై ఆ పరిస్థితిని గట్టెక్కించానన్నారు. ఇదే సందర్భంలో పాతబస్తీలో ఘర్షణలు, రాష్ట్ర విభజన ఉద్యమ సెగలు.. ఇలా ఎన్నో సమస్యలు రాష్ట్రంలో అలజడి రేపాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను సమన్వయం చేసుకుంటూ వస్తున్నానని అన్నారు. ప్రతిపక్షాల సూచనలను తాను పరిగణనలోకి తీసుకుంటానని చెప్పారు. సీఎం పదవిలో ఉన్నా తాను మామూలోడినేనని అన్నారు.
'దేశంలో ఒకే ఒక్క మొనగాడు రోశయ్య' అని సభలో కర్నూలు ఎమ్మెల్యే టి.జి.వెంకటేశ్ అభివర్ణించారు. ఆర్యవైశ్యులు పులి బిడ్డల్లాగా బతకాలన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఎవరైనా ధ్వంసం చేస్తే పంజా విప్పాలని ఉద్రేకంగా అన్నారు. కుల సమావేశం నిర్వహించింది రోశయ్యకు సంఘీభావం ప్రకటించడానికేనని చెప్పారు.












Click it and Unblock the Notifications