సోనియాతో రోశయ్య రహస్య భేటీ: మీడియాకు దూరం

ఆయన ఢిల్లీలో తన సమావేశాలకు సంబంధించిన వివరాలను రోశయ్య ఎవరికీ చెప్పడం లేదు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీని కలిసిన తర్వాత సోనియాతో రోశయ్య పది నిమిషాల పాటు సమావేశమయ్యారు. రహస్య తన భేటీలను రహస్యంగా ఉంచడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. రోశయ్య రాజీనామా లేఖ ఇచ్చారని వైయస్ జగన్ వర్గం ప్రచారం సాగిస్తోంది. సోనియాతో సమావేశమైన తర్వాత రోశయ్య తాను ఆ విషయాన్ని ధ్రువీకరించడానికి నిరాకరించారు. తాజా రాజకీయాలపై, మరికొన్ని ముఖ్య విషయాలపై రోశయ్య సోనియాతో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. వైయస్ జగన్ వ్యవహారంపై, మంత్రి వర్గ విస్తరణపై ఆయన సోనియాతో మాట్లాడినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications