వైయస్ జగన్ వర్గానిదే సాంకేతిక కారణమే: చెల్లుబాటు కాదా?

YS Jagan
హైదరాబాద్: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై చర్యలు తీసుకోవడానికి తగిన కారణాలు లేవని ఆయన వర్గం వాదిస్తోంది. అందుకు సాంకేతిక కారణాలను ముందు పెడుతోంది. సోనియా గాంధీకి సాక్షి మీడియాలో వచ్చిన వార్తాకథనంతో వైయస్ జగన్ కు సంబంధం లేదని, ఎడిటోరియల్ బోర్డుకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని, అందువల్ల సాక్షి వార్తాకథనం ఆధారంగా వైయస్ జగన్ పై చర్య తీసుకోవడానికి వీలు కాదని వాదిస్తోంది. అంబటి రాంబాబు, కొండా సురేఖ, గోనె ప్రకాశ రావు వంటి నాయకులు ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నారు. దీని ఆధారంగా ఓ వార్తా సంస్థ వైయస్ జగన్ పై చర్యలు ఉండవని మంగళవారం ఓ వార్తాకథనాన్ని ఇచ్చింది.

కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవరాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ జగన్ కు అనుకూలంగా ఉండడంతో ఆ వార్తాకథనం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అందులో నిజం లేకపోలేదు కూడా. జాతీయ మీడియాను ప్రభావితం చేయడానికి వీలైన పరిస్థితి వైయస్ జగన్ కు ఉంది. వాస్తవాలు తెలిసిన తెలుగు మీడియా మాత్రం అందుకు విరుద్ధమైన కథనాలను ఇస్తోంది. సాక్షి కథనంపై చర్య తీసుకోవడానికి వీలు కాకపోయినా మీడియాలో సోనియాకు వ్యతిరేకంగా వచ్చిన వార్తాకథనాన్ని ప్రతి కాంగ్రెసు నాయకుడు కూడా ఖండించాల్సి ఉంటుందని, అలా చూస్తే వైయస్ జగన్ కూడా ఖండించాలని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ ఓ ప్రైవేట్ టీవీ చానెల్ తో అన్నారు. ఓదార్పు యాత్ర చేపట్టడం, రెండు మూడు సార్లు పరోక్షంగా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడం, మొత్తంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను నడిపించడం వంటి కారణాలతో పార్టీ అధిష్టానం వైయస్ జగన్ ను వివరణ అడిగే అవకాశం ఉంది.

సాంకేతి కారణాలను చూపుతూ పార్టీ అధిష్టానం చర్య తీసుకుంటే ధ్వజమెత్తడానికి అనువైన వాతావరణాన్ని వైయస్ జగన్ వర్గం కూడగట్టుకుంటున్నట్లు భావిస్తున్నారు. అయితే, వైయస్ జగన్ పై చాలా పకడ్బందీగా వైయస్ జగన్ దాన్ని తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి వీలు లేకుండా చర్యలకు ఉపక్రమించాలనే ఉద్దేశంతో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. వైయస్ జగన్ సొంత కుంపటి పెట్టుకోవడానికి సిద్ధమైనట్లు పార్టీ అధిష్టానానికి స్పష్టమైన సంకేతాలున్నాయి. అందువల్ల ఆయన పార్టీలో ఉండడం సాధ్యం కాదనే నిర్ణయానికి కూడా వచ్చింది. చర్యలు తీసుకోవడానికి గల ఆటంకాలను తొలగించుకోవడం లేదా జగన్ ను ఒంటిరి చేసే బయటకు వెళ్లేలా చూడడమే పార్టీ అధిష్టానం వద్ద ఉన్న అంశాలు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+