సిఎం కిరణ్ ఢిల్లీ పర్యటన ఖరారు, సోమవారం కేబినెట్ ప్రమాణస్వీకారం

Kiran kumar Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీ పర్యటన ఖరారయ్యింది. కిరణ్ ఆదివారం ఉదయాన్నే ఢిల్లీ వెళ్లనున్నట్లు సమచారం. అక్కడ ఏఐసిసి అధ్యక్షురాలితో భేటీ కానున్నారు. ఆమెకు కృతజ్ఞతలు తెలిపిన అనంతరం ఆయన మంత్రివర్గ ఏర్పాటుపై సోనియాతో చర్చించే అవకాశాలున్నాయి. జగన్ వర్గం విషయం కూడా చర్చకు వచ్చే అవకాశముంది. ఆయన వర్గంలోని తాజా మాజీలకు లేదా శాసనసభ్యులకు మంత్రి పదవులు ఇవ్వవద్దా లేదా అన్న విషయాన్ని సోనియా సూచన మేరకు ఆయన నిర్ణయించుకోనున్నారు.

సోనియాతో భేటీ అనంతరం ఆయన సాయంత్రం తిరిగి హైదరాబాదుకు చేరుకుంటారు. సోమవారం మంత్రివర్గం ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ తర్వాత ఆయన సచివాలయానికి వెళతారని సమాచారం. శనివారం వరకు సోనియా ఢిల్లీలో ఉండనందున ఆయన శుక్రవారం ఢిల్లీ పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం రాయబరేలిలో ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+