జగన్ ప్రజలకు, రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తి కాదు: గట్టు

Gattu Ramachandra Rao
హైదరాబాద్: పార్టీలో తనకు ఘోరమైన అవమానం జరుగుతున్నందువల్లనే వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పార్లమెంటరీ సభ్యత్వానికి రాజీనామా చేశారని గట్టు రామచంద్రారావు సోమవారం విలేకరులతో అన్నారు. జగన్ ఒక్కడు కాదని ఆయనకు కోట్లాదిమంది దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి అభిమానుల అండ ఉన్నదన్నారు. జగన్ చాలా ఉన్నత విలువలు కలిగిన నాయకుడున్నారు. ఆయనకు నీచ రాజకీయాలు తెలియవన్నారు.

జగన్ చంద్రబాబులా వైస్రాయ్ హోటల్లో కూర్చొని అధిష్టానానికి వ్యతిరేకంగా రాజకీయాలు చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ తీరు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నదన్నారు. ప్రజలు అభీష్టం మేరకే జగన్ కార్యాచరణ ఉంటుందన్నారు. జగన్ తన ఓదార్పును కొనసాగిస్తారన్నారు. ఆయన రాజీనామా అనంతరం ప్రజల్లోకి తప్పకుండా వెళతారన్నారు. ఆయన ఎవరికో భయపడి ప్రజలకు, రాజకీయాలకు దూరంగా ఉండే వ్యక్తి కాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+