కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంపై ఎగిసి పడుతున్న అసంతృప్తి జ్వాలలు

కాగా కర్నూలు పాణ్యం శాననసభ్యుడు కాటసాని రాంభూపాలరెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ తనకు మంత్రివర్గంలో స్థానం కేటాయించకపోవడానికి ఖచ్చితంగా కారణం చెప్పాలన్నారు. తాను 5 సార్లు జిల్లానుండి ఎక్కువ సార్లు గెలిచిన సీనియర్ నాయకుడిగా ఉన్నానని చెప్పారు. అనంతపురంనుండి జేసి దివాకర్ రెడ్డి కూడా తీవ్ర నిరాశతో ఉన్నారు. అయితే తాను కాంగ్రెస్ పార్టీని వీడేది లేదన్నారు. కాంగ్రెస్ ఉంటానని చెప్పటమే నా బలహీనతగా కిరణ్ గుర్తించారన్నారు. మంత్రివర్గం అధిష్టానం ప్రకారం కాకుండా కిరణ్ ముద్ర ఉన్నదన్నారు. గాదె వెంకటరెడ్డి సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన అనుభవాన్ని పరిగణలోకి తీసుకోలేదన్నారు. తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని మాట తప్పారని రాంరెడ్డి దామోదరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications