ప్రణబ్ ను ప్రధాని అంటూ ఢిల్లీలో వెలిసిన హైదరాబాదు పోస్టర్లు

ప్రణబ్ నే ప్రధానిగా ప్రతి సామాన్యుడి మనసులోని మాట అని ఆ పోస్టర్లలో పేర్కొన్నారు. చివరలో కాంగ్రెసును రక్షించాలి, హిందూస్థాన్ రక్షించాలి అని, జై కాంగ్రెస్, జై హిందూస్థాన్ అని నినాదాలు ఉన్నాయి. అయితే దేశ రాజధానిలో వెలిసిన పోస్టర్లు ఢిల్లీలో ప్రింటయినవి కాకుండా మన రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్రింటయినట్లు సమాచారం. పోస్టర్లు హైదరాబాద్ సెంట్రల్ కమిటీ పేరుతో ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్రానికి సంబంధించిన వారే ఈ చర్యలకు పాల్పడి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications