ముఖ్యమంత్రి, శాసనసభ స్పీకర్ లకు సుప్రీం కోర్టు నోటీసులు..
National
oi-Nageshwara Rao M
By Nageswara Rao
న్యూఢిల్లీ: కర్ణాటక ముఖ్య మంత్రి బీయస్ యడ్యూరప్ప, శాసనసభ స్పీకర్ కేజీ బోపయ్య లకు అత్యున్నత న్యాయస్దానమైన సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. శాసనసభలో విశ్వాస పరీక్ష సందర్బంగా 11మంది భాజపా ఎమ్మేల్యేలపై స్పీకర్ అనర్హాత వేటు వేసిన సంగతి అందరికి తేలిసిందే. దీనిపై ఎమ్మేల్యేలు కర్ణాటక హైకోర్టుని ఆశ్రయించగా, కర్ణాటక హైకోర్టు స్పీకర్ నిర్ణయాన్ని సమర్దించింది. దీంతో స్పీకర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఎమ్మేల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అక్కడ వాదనలు విన్న న్యాయమూర్తులు జస్టిస్ అల్తమాన్ కబీర్, సిరియాక్ జోసెఫ్ లు కర్ణాటక ముఖ్యమంత్రి, స్పీకర్ కునోటీసులు జారీచేశారు. ఈనెల ఏడో తేదీలోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను తోమ్మిదో తేదీకి వాయిదా వేశారు.