వట్టి మినహా మంత్రివర్గ సమావేశానికి హాజరైన మంత్రులు

ఉప ముఖ్యమంత్రి రేసులో ఉన్న దామోదర రాజనర్సింహా సైతం చివరి నిమిషం వరకు ఎక్కడ ఉన్నారో మీడియాకు సైతం తెలియదు. అయితే ఆయన నేరుగా సమావేశానికి వచ్చారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడటానికి నిరాకరించారు. పొన్నాల లక్ష్మయ్య, రాంరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి పలువురు అసంతృప్తులు సైతం వచ్చారు. అయితే ముఖ్యమంత్రి తమకు త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని హామీ ఇస్తేనే బాధ్యతలు తీసుకుంటామని చెప్పినట్టు సమాచారం.
కాగా పదవి కోసం మంత్రులెవరూ రాజీనామా చేయరని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. టీవీల్లో ప్రాధాన్యం ఉన్న శాఖ కోసం మంత్రులు రాజీనామా అంటూ స్ర్కోలింగ్ వస్తుందని ఇవన్నీ అవాస్తవాలు అన్నారు. పదవుల కోసం రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణకు మాత్రం కట్టుబడి ఉన్నామని ఆయన చెప్పారు. తనకు ఏ శాఖ ఇచ్చినా కొనసాగుతానన్నారు.












Click it and Unblock the Notifications