త్వరలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ: అంబటి రాంబాబు

Ambati Rambabu
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీకి, పార్టీ పరంగా సంక్రమించిన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టనున్నారని అంబటి రాంబాబు గురువారం మీడియా సమావేశంలో ప్రకటించారు. అయితే పార్టీ ప్రారంభించేది సాయంత్రమా, రేపా, ఎల్లుండా నెలరోజులా, సంవత్సరమా అనేది తాను చెప్పలేనని, అది జగన్ మాత్రమే ప్రకటిస్తాడని చెప్పారు. అయితే దానికి కొంత వ్యవధి కావాలని చెప్పారు. కాంగ్రెసు పార్టీనుండి బయటకు వచ్చిన వారిని, ఆయా జిల్లాలోని జగన్ వర్గ నాయకులను కలిసిన తర్వాత విధివిధానాలు ఏర్పరుచుకొని పార్టీని ప్రకటిస్తారన్నారు.

వైయస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత కాంగ్రెసు పార్టీలో, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రజలు జగన్ ను ఆశీర్వదిస్తున్నారన్నారు. జగన్ పార్టీ ఎప్పుడు పెట్టినా ప్రజలు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ ఆశీస్సులు ఆయనకు ఉంటాయన్నారు. పార్టీకి కసరత్తు ఇంకా ప్రారంభం కాలేదన్నారు. ప్రాంతీయ పార్టీ పెట్టాలంటే అనేక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. జిల్లాల నాయకులను సంప్రతించి వారినుండి ఇన్ పుట్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంపై తానేమీ వ్యాఖ్యానించనన్నారు. ప్రభుత్వం విషయం తమకేమీ తెలియదన్నారు. ప్రభుత్వాన్ని కూలదోయాలన్న ఎలాంటి దుర్బుద్ది జగన్ లేశ మాత్రం లేదన్నారు. ముఖ్యమంత్రి మంత్రివర్గ కూర్పులో సామాజిన న్యాయం పాటించారా లేదని అనేది కూడా తాను వ్యాఖ్యానించనన్నారు. జగన్ పార్టీకి మార్గనిర్దేశకులు జనమే అన్నారు. జగన్ కాంగ్రెసు నుండి తనంత తాను బయటకు వెళ్లలేదన్నారు. కాంగ్రెసు ను ఆయనను బయటకు వెళ్లే పరిస్థితులు కల్పించిందన్నారు. 2014లో జగన్ పార్టీకి అత్యంత మెజారిటీ ఖాయమన్నారు. అయితే జగన్ తన పార్టీని పులివెందుల శాసనసభకు, కడప పార్లమెంటుకు జరిగే ఉప ఎన్నికలకు ముందుగానే ప్రకటిస్తారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+