పదవుల పంపకంపై మంత్రివర్గ సమావేశంలో బొత్స సత్యనారాయణ నోట్

కులాలవారీగా మంత్రి పదవుల పంపకంలో ఏం జరిగిందో బొత్స సత్యనారాయణ తన నోట్ లో వివరించారు. మంత్రుల శాఖల కేటాయింపు జాబితాను సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. సీనియర్ మంత్రుల శాఖల కేటాయింపుల్లో మార్పులు చేయడానికి కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించినట్లు చెబుతున్నారు. జానా రెడ్డి వద్ద పంచాయతీరాజ్ శాఖను బొత్స సత్యనారాయణకు కేటాయించే అవకాశాలున్నట్లు సమాచారం. జానారెడ్డికి భారీ నీటిపారుదల శాఖను కేటాయించి, సుదర్శన్ రెడ్డికి ఆరోగ్య శాఖల్లో రెండింటిని ఇచ్చే అవకాశాలున్నట్లు సమాచారం. ధర్మాన ప్రసాదరావుకు వాణిజ్యం, విద్యుచ్ఛక్తి శాఖల్లో ఒకదాన్ని కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications