వట్టితో మాట్లాడాలని కెవిపి రామచంద్రారావుకి అధిష్టానం ఫోన్

KVP Ramachandar Rao
న్యూఢిల్లీ: మంత్రి పదవికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన వట్టి వసంత్ కుమార్ తో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాల్సిందిగా కాంగ్రెసు అధిష్టానం మాజీ ప్రభుత్వ సలహాదారు, సీనియర్ నాయకులు కెవిపి రామచంద్రారావును ఆదేశించింది. మంత్రివర్గంలో ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పార్టీలో చర్చించుదామని చెప్పింది. అయితే అసంతృప్తులు మీడియా ముందుకు వెళితే మాత్రం రాజీనామాలు ఆమోదించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించినట్టు సమాచారం.

సాయంత్రం జరిగే మంత్రివర్గ సమావేశానికి అందరూ హాజరు కావాలని ఆదేశించింది. అందరూ ముఖ్యమంత్రికి అక్కడ మద్దతుగా నిలబడాలని ఆదేశించింది. కాంగ్రెసు అధిష్టానం కఠినంగా వ్యవహరించడంతోనే వట్టి వసంత్ కుమార్ కాస్త వెనక్కి తగ్గినట్టు సమాచారం. వట్టి మొండి పట్టుదలగా ఉంటే మంత్రి పదవితో పాటు శాసనసభ్యత్వ రాజీనామాను ఆమోదిస్తామని ప్రకటించినట్టు సమాచారం. వట్టి మొదట మంత్రి పదవితోపాటు, శాసనసభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు.

అధిష్టానం సీరియస్ కావటంతో ఆయన శాసనసభ్యునిగా కొనసాగుతానని, కాంగ్రెసు పార్టీలోనే ఉంటానని మీడియాకు లేఖ విడుదల చేశారు. కాగా బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్యలకు సైతం సోనియాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి అహ్మద్ పటేల్ ఫోన్ చేశారు. దీంతో అసంతృప్త మంత్రులు క్యాబినెట్ సమావేశానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+