అసమ్మతి మంత్రులపై హై కమాండ్ సీరియస్, వెనక్కి తగ్గాలని సూచన

Congress
న్యూఢిల్లీ: శాఖల కేటాయింపుపై అసమ్మతి వ్యక్తం చేస్తూ గ్రూపులుగా సమావేశాలు నిర్వహిస్తున్న మంత్రులపై కాంగ్రెసు అధిష్టానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అసమ్మతి మంత్రులకు హెచ్చరికలు చేసినట్లు సమాచారం. శాఖల కేటాయింపుల్లో అన్యాయం జరిగితే సరిచేసుకోవచ్చునని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడి సవరించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. అసమ్మతి మంత్రులు బొత్స సత్యనారాయణ వంటివారితో ప్రణబ్ ముఖర్జీ, అహ్మద్ పటేల్ మాట్లాడారు. అవసరమైతే తమ దృష్టికి తెస్తే శాఖల కేటాయింపుల్లో మార్పులు చేర్పులు చేసుకోవచ్చునని, కానీ వీధికెక్కడం సరి కాదని చెప్పినట్లు సమాచారం. ఇలాగే వ్యవహరిస్తే రాజీనామాలను ఆమోదింపజేస్తామని కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన దూతలుగా అసమ్మతి మంత్రులతో చర్చలు జరపడానికి మంత్రులు కె. జానారెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, పితాని సత్యనారాయణ వంటివారిని రంగంలోకి దింపారు. వారు అసమ్మతి మంత్రులతో విడివిడిగా చర్చలు జరుపుతున్నారు. అధిష్టానం హెచ్చరికతో అసమ్మతి మంత్రులు ఓ మెట్టు దిగినట్లు తెలుస్తోంది. తొలుత సాయంత్రం జరిగే మంత్రివర్గ సమావేశానికి హాజరు కాకూడాదని భావించిన అసమ్మతి మంత్రులు ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నారు. మంత్రులెవరూ రాజీనామా చేయరని, ముఖ్యమంత్రి పరిస్థితిని చక్కదిద్దుకుంటారని రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఢిల్లీలో చెప్పారు. మంత్రి పదవి రాలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన పాణ్యం శాసనసభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రిని కలిశారు.

కాగా, మంత్రివర్గంలో చోటు చేసుకున్న అసంతృప్తిపై ఢిల్లీలోని కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఆసక్తిగా గమనిస్తున్నారు. వారు అధిష్టానానికి చెందిన పెద్దలను కలిశారు. ప్రాంతాలవారీగా పార్లమెంటు సభ్యులు సమావేశమయ్యారు. మంత్రివర్గంపై నోరు మెదపవద్దని అధిష్టానం వారిని ఆదేశించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+