హైకమాండ్ కు షరతులు పెట్టిన అసంతృప్త మంత్రులు

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరించిన తీరును సరి చేయడానికి ప్రత్యేక దూతను హైదరాబాదు పంపించాలని అసంతృప్త మంత్రులు పార్టీ అధిష్టానాన్ని కోరారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వైయస్ జగన్ దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉందని, దాన్ని నివారించడానికి ముందుకు రావాలని వారు అధిష్టానానికి సూచించారు. కాగా, మంత్రి ధర్మాన ప్రసాదరావు నివాసంలో అసంతృప్త మంత్రులు సమావేశమయ్యారు. మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కు కలిసి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయనను బుజ్జగించేందుకు కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నించారు.












Click it and Unblock the Notifications