ధర్మాన నివాసంలో అసంతృప్త మంత్రుల భేటీ, కార్యాచరణపై చర్చ

Dharmana Prasad Rao
హైదరాబాద్: ఎనిమిది మంది అసంతృప్త మంత్రులు గురువారం ఉదయం ధర్నాన ప్రసాదరావు ఇంట్లో భేటీ అయ్యారు. మరో 15 మంది శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు సైతం వీరిలో ఉన్నారు. తమకు కేటాయించిన శాఖలు ప్రాధాన్యం లేనివిగా వారు అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. మంత్రులు విశ్వరూప్, పొన్నా లక్ష్మయ్య, బొత్స సత్యనారాయణ, అహ్మదుల్లా, జూపల్లి కృష్ణారావు, వట్టి వసంత్ కుమార్, కన్నా లక్ష్మీనారాయణ తదితరులు ధర్మాన ఇంటిలో బేటీ అయ్యారు.

వట్టి వసంత్ కుమార్ ఇప్పటికే మంత్రిపదవికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయనను తన రాజీనామా ఉపసంహరించుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి కోరారు. వట్టితో మాట్లాడడానికి ఆనం రామనారాయణరెడ్డిని దూతగా పంపించారు. అయితే ఆయన ఆనంతో మాట్లాడడానికి ఇష్టపడలేదు. తను ఆయనతో మాట్లాడేది లేదని చెప్పారు. వట్టి కనుక తన రాజీనామాను ఉపసంహరించుకోకపోతే ఆయన రాజీనామా ఆమోదించే అవకాశాలు ఉన్నాయి. కాగా చివరి నిమిషం వరకు ఉపముఖ్యమంత్రి అభ్యర్థిగా పేరు వినిపించిన దామోదర రాజనర్సింహ ఇంటిలో శాసనసభ్యులు కె లక్ష్మారెడ్డి, జగ్గారెడ్డి, ముఖేష్ గౌడ్ లు సైతం భేటీ అయ్యారు.

తనకు 15 రోజులు సమయం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆసంతృప్త మంత్రులను కోరారు. అసంతృప్త మంత్రులు ప్రాంతాల వారిగా విడిపోయి భేటీ అవుతున్నారు. వారు తమ అధిష్టానం రావాల్సిందిగా కోరుతున్నారు. అధిష్టానానికి తమ డిమాండ్లు ముందు పెడుతున్నారు. అధిష్టానం నుండి ఎవరైన వస్తే తమ డిమాండ్లు ఎలా ఉండాలో వారు భేటీలలో చర్చించుకున్నట్లు సమాచారం. అయితే రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ వీరప్పమొయిలీగానీ, ఆజాద్ గానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+