వట్టి రాజీనామాపై అధిష్టానం సీరియస్: అవసరమైతే వేటు!

కాగా అసంతృప్తులను బుజ్జగించడానికి జానారెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి రంగంలోకి దిగారు. తీవ్ర అసంతృప్తితో ఉన్న బొత్స సత్యనారాయణ దగ్గరకు జానారెడ్డి వెళ్లారు. ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. ఆలాగే ఆనం, రఘువీరారెడ్డిలు సైతం మిగిలిన అసంతృప్తుల వద్దకు వెళ్లి కూల్ చేసే ప్రయత్నాలు చేశారు. అయితే అసంతృప్త మంత్రులు కూడా కాస్త వెనక్కు తగ్గుతున్నారు. మొదట సాయంత్రం కేబినెట్ మీటింగ్ కు హాజరు కావద్దనుకున్నప్పటికీ ఆ తర్వాత మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యి నేరుగా ముఖ్యమంత్రితోనే తేల్చుకుందామనే ఉద్దేశ్యానికి వచ్చారు.
పిసిసి ప్రతినిధులు మాదాసు గంగాధరం, గిడుగు రుద్రరాజు వట్టి వద్దకు రాయబారానికి వెళ్లారు. అయితే అధిష్టానం కూడా అసంతృప్తులను తేలిగ్గా తీసుకొని అవసరమయితే వేటుకు కూడా సిద్ధమవుతుండటంతో అసంతృప్తులు వెనక్కు తగ్గుతున్నట్లు సమాచారం. కాగా నాకు హోంశాఖ ఇవ్వాలని నా అభిమానులు పట్టుబడుతున్నారని మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి అంటున్నారు. జగన్ పార్టీ పెడితే ఆలోచిస్తానని కూడా చెప్పారు.












Click it and Unblock the Notifications