వైయస్ జగన్ కు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రుల అసమ్మతి లాభిస్తుందా?

అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మంత్రులు ఎవరు కూడా వైయస్ జగన్ తో వెళ్లే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఇటీవలి వరకు వైయస్ జగన్ కు కొంత అనుకూలంగా ఉన్నట్లు కనిపించారు. కానీ, ఆయన మనసు మార్చుకున్నట్లు సమాచారం. గతంలో జగన్ కు అనుకూలంగా ఉన్న దానం నాగేందర్ వంటివారు కూడా ఆయనతో వెళ్లడానికి సిద్ధంగా లేరు. కాంగ్రెసులోనే ఉంటే చాలా మంది వైయస్ జగన్ కు అనుకూలంగా వ్యవహరించేందుకు సిద్ధంగా ఉన్నారు. జగన్ పార్టీ నుంచి వెళ్లిపోవడంతో ఆయన వెంట వెళ్లడానికి సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ, పొన్నాల లక్ష్మయ్య, ధర్మాన ప్రసాదరావు వంటి సీనియర్ మంత్రులు ఎవరు కూడా వైయస్ జగన్ వెంట వెళ్లే అవకాశాలు లేవని అంటున్నారు. కేవలం ప్రాధాన్యం లేని శాఖలు కేటాయించి అవమానించారనే ఆగ్రహంతోనే వారు ఉన్నారు తప్ప పార్టీ నుంచి వెళ్లిపోవాలనే ఉద్దేశంతో వారు లేరు.












Click it and Unblock the Notifications