బొత్స సత్యనారాయణ ఫైర్: దిగొచ్చిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్?

Kiran kumar Reddy
హైదరాబాద్‌: మంత్రులకు కేటాయించిన శాఖలపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగొచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన తొలి మంత్రి వర్గ సమావేశంలో గురువారం సాయంత్రం 15 నిమిషాల లోపే ముగిసింది. అయితే, మంత్రివర్గ సమావేశానికి ముందే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసంతృప్తికి గురైన మంత్రులతో విడివిడిగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సమయంలో బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రిపై ఫైర్ అయినట్లు తెలుస్తోంది. తాము శాఖల మార్పును వ్యక్తిగత ప్రతిష్ట కోసం అడగడం లేదని, పార్టీ ప్రయోజనాల కోసమే అడుగుతున్నామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఒకే సామాజిక వర్గానికి పదవులు కేటాయిస్తున్నారనే సంకేతాలు వెళ్తే పార్టీకి నష్టం జరుగుతుందని, పార్టీని ఏం చేయదలుచుకున్నారని బొత్స అన్నట్లు తెలుస్తోంది. 2014లో పార్టీని ఓడించదలుచుకున్నారా, గెలిపించదలుచుకున్నారా అని బొత్స సత్యనారాయణ అడిగినట్లు తెలుస్తోంది.

మరో సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాద రావు కూడా అదే విధమైన వైఖరిని ప్రదర్శించినట్లు సమాచారం. వైయస్ జగన్ ను దృష్టిలో పెట్టుకుని కడప జిల్లాకు ప్రాధాన్యం ఇచ్చినట్లు ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, దీన్ని సీనియర్ మంత్రులు అంగీకరించలేదని సమాచారం. ఈ స్థితిలో ముఖ్యమంత్రి దిగివచ్చినట్లు సమాచారం. తన వద్ద ఉన్న కొన్ని ముఖ్యమైన శాఖలను సీనియర్లకు కేటాయిస్తానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. నాలుగైదు శాఖలను మార్చి, సీనియర్లకు ప్రధానమైన శాఖలు వచ్చేలా చూస్తానని, అయితే దానికి తనకు కొంత సమయం కావాలని ఆయన అడిగినట్లు తెలుస్తోంది. విశ్వరూప్ వంటి అసమ్మతి మంత్రులు కూడా కిరణ్ కుమార్ రెడ్డి వద్ద తమ వాదనను వినిపించినట్లు తెలుస్తోంది.

కాగా, మంత్రివర్గ సమావేశం సజావుగా జరిగిందని మంత్రి దామోదరం రాజనర్సింహ చెప్పారు. డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి పదవి, అసమ్మతి విషయాలను పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ఆయన మీడియా ప్రతినిధులతో చెప్పారు. వట్టి వసంతకుమార్ కు కూడా నచ్చజెప్పాలని కిరణ్ కుమార్ రెడ్డి బొత్స, ధర్మాన వంటి సీనియర్ మంత్రులను కోరినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+