శాఖలు మార్చేది లేదంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

ఆనం రామనారాయణ రెడ్డి, పితాని సత్యనారాయణ, రఘువీరా రెడ్డి, కె. జానారెడ్డి ముఖ్యమంత్రి తరఫున రాయబారులుగా అసమ్మతి మంత్రులతో చర్చలు జరిపారు. పార్టీ అధిష్టానం కూడా రంగంలోకి దిగింది. దీంతో చాలా మంది దారికి వచ్చినట్లు తెలుస్తోంది. వట్టి వసంతకుమార్, బొత్స సత్యనారాయణ వంటి ఇద్దరు, ముగ్గురు మంత్రులు తప్ప మిగతా వారంతా ఆసంతృప్తితోనే సర్గుకుపోవడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం.
మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, విస్తరమ సమయంలో శాఖలను మార్చడానికి వీలవుతుందని, ఇప్పుడు శాఖలు మారిస్తే ఇతరులు అసంతృప్తికి గురయ్యే ప్రమాదం ఉందని కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. డిసెంబర్ 31వ తేదీన శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత మంత్రుల శాఖల మార్పులు చేసుకోవచ్చునని ఆయన అంటున్నట్లు తెలుస్తోంది. ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ప్రస్తుతానికి పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చేవరకు ఉప ముఖ్యమంత్రి పదవి ఊసెత్తకూడదని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications