డిసెంబర్ 31వ తేదీ తర్వాతనే వైయస్ జగన్ కొత్త పార్టీ

శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు అనుకూలంగా ఉంటుందా, వ్యతిరేకంగా ఉంటుందా అనేది తేలితే పార్టీ విధివిధానాలను ఖరారు చేసుకోవడం సులభమవుతుందని వైయస్ జగన్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 21వ తేదీననే పార్టీని ప్రకటించాలని వైయస్ జగన్ తొలుత అనుకున్నప్పటికీ తెలంగాణ నాయకుల సూచన మేరకు మరింత కాలం ఆగేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణ కమిటీ నివేదికను బట్టి పార్టీ విధివిధానాల్లో తెలంగాణ అంశాన్ని చేర్చడానికి తాము సూచనలు చేస్తామని కొండా సురేఖ ఓ ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్ తో అన్నారు.












Click it and Unblock the Notifications