వైయస్ వివేకా దౌత్యం: అధిష్టానానికి అసమ్మతి మంత్రుల అల్టిమేటం

YS Vivekananda Reddy
హైదరాబాద్‌: అసమ్మతి మంత్రులకు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి దౌత్యం నెరిపారు. శాఖల కేటాయింపులో మార్పులు చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఒప్పించేందుకు ఆయన రంగంలోకి దిగినట్లు సమాచారం. 15 రోజుల గడువు ఇవ్వాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసమ్మతి మంత్రులను కోరినట్లు సమాచారం. అంతేకాకుండా ఐదుగురు సీనియర్ల శాఖలను మార్చడానికి ఆయన అంగీకరించినట్లు చెబుతున్నారు. బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, కన్నా లక్ష్మి నారాయణ, వట్టి వసంతకుమార్, పొన్నాల లక్ష్మయ్య శాఖలను మార్చడానికి ఆయన ఒప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, అసమ్మతి మంత్రులు అందుకు అంగీకరించడానికి సిద్ధంగా లేరు.

ధర్మాన ప్రసాదరావు నివాసంలో జరిగిన అసమ్మతి మంత్రులు, శాసనసభ్యుల సమావేశం ముగిసింది. కాంగ్రెసు పార్టీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చినట్లు సమాచారం. అధిష్టానం హామీ ఇస్తేనే తాము సాయంత్రం జరిగే మంత్రివర్గ సమావేశానికి హాజరవుతామని వారు కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో చెప్పినట్లు తెలుస్తోంది. వారు ప్రణబ్ ముఖర్జీతో ఫోన్ లో మాట్లాడారు. సీనియర్లకు కీలక శాఖలు కేటాయించాలని, మంత్రులందరి శాఖలను కూడా మార్చాలని వారు పట్టుబడుతున్నారు. ముఖ్యమంత్రి నుంచి ప్రతిపాదనలు వస్తే చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా వారు చెబుతున్నారు.

కాగా, అంతా సర్దుకుంటుందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్పమ మొయిలీ ఢిల్లీలో అన్నారు. తాము హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అంతా చూసుకుంటారని ఆయన అన్నారు. మంత్రి వర్గ సంక్షోభంపై భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామనే హామీపై మాత్రం మాట్లాడడానికి ఆయన నిరాకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+