రోశయ్యది పనిచేయని , కిరణ్ ది భద్రత లేని ప్రభుత్వం: చుక్కా రామయ్య
State
oi-Srinivas G
By Srinivas
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యది పని చేయని ప్రభుత్వం అయితే ఇప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిది భద్రత లేని ప్రభుత్వమని శాసనమండలి సభ్యుడు, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య శుక్రవారం విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించటంలో ప్రభుత్వం విఫలమవుతుందన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. వారు ప్రజా సమస్యలపై అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యంగా ఉండాలన్నారు.