బీదర్: కర్ణాటక రాష్ట్రంలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీదర్ జిల్లా ఉమ్నాబాద్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 13మంది దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు. బస్సు-సుమో ఒకదానికొకటి ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. వీరంతా తిరుపతి నుంచి తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు మహారాష్ట్ర లాతూర్ జిల్లా టకళాగావ్ వాసులు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.