వైయస్ జగన్ శిబిరం అస్త్రంగా వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదం

వైయస్ జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యురాలు కొండా సురేఖ కూడా వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదాన్ని ప్రధానంగా ఇటీవల ప్రస్తావించారు. ప్రమాదంపై పలు అనుమానాలున్నాయని ఆమె అన్నారు. వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదంపై ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తాను పార్టీకి, లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి రాసిన లేఖలో కూడా వైయస్ జగన్ ప్రధానంగా ప్రస్తావించారు. వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదంపై అనుమానాలను నివృత్తి చేయలేకపోయారని ఆయన అన్నారు. దీన్ని బట్టి వైయస్సార్ హెలికాప్టర్ ప్రమాదాన్ని వైయస్ జగన్ కొత్త పార్టీ కాంగ్రెసుపై ఓ అస్త్రంగా సంధిస్తుందనేది అర్థమవుతోంది.












Click it and Unblock the Notifications