నర్సుల ఆందోళనకు దిగివచ్చిన ప్రభుత్వం: ఆందోళన విరమణ

దీంతో ఈనెల 12న జరగాల్సిన పరీక్షలను ప్రభుత్వం 19వ తేదికి వాయిదా వేసింది. ఇంతకుముందు కూడా నర్సులు పలుమార్లు ఆందోళన నిర్వహించినప్పుడు మంత్రి పొన్నాల లక్ష్మయ్య, దానం నాగేందర్ లు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ ఇంతవరకు నెరవేరక పోవడంతో వారు మళ్లీ ఆందోళన చేపట్టారు. తమ ఉద్యోగాలు క్రమబద్దీకరించాలంటూ నీళ్ల ట్యాంకు ఎక్కి ఆందోళన చేశారు. నర్సుల ఆందోళన సోమవారం ఉద్రిక్తంగా మారింది. పోలీసుల వచ్చి ట్యాంకుపైనున్న నర్సులను దింపే ప్రయత్నాలకు పూనుకున్నారు. అయితే కింద ఆందోళన చేస్తున్న వారు పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులు బలవంతంగా వెళ్లడానికి ప్రయత్నాలు చేయడంతో ఇద్దరు నర్సులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఒక నర్సు బ్లేడుతో చేతిపైన కోసుకున్నది. మరో నర్సు కిరోసిన్ ఒంటిపైన పోసుకొని అత్యహత్యాయత్నానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు వారించారు. దీంతో పోలీసులు పైకి ఎక్కకుండా ఆగిపోయారు. కాగా అధికారులు మాత్రం నర్సులను సంప్రదించలేదు. క్రమబద్దీకరణ అనేది మా చేతుల్లో లేదని వారు చేతులెత్తేస్తున్నారు. కాగా ప్రభుత్వ దిగి వచ్చే వరకు తమ ఆందోళన ఆపేది లేదని మరోవైపు నర్సులు అంటున్నారు.


Click it and Unblock the Notifications