ఫ్రాన్స్ తో భారత్ కీలక పౌర అణు సరఫరా ఒప్పందం

రక్షణ రంగానికి సంబంధించిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఫ్రాన్సు అందిస్తోందని ఈ సందర్భంగా ప్రధాని మన్మోహన్ అన్నారు. పారిస్ లో భారత సాంస్కృతిక సంస్థను నెలకొల్పనున్నట్లు ఆయన ప్రకటించారు. కీలకమైన పౌర అణు ఒప్పందం ఫ్రాన్సుతో కుదుర్చుకోవడం హర్షదాయకమన్నారు. 2012 నాటికి భారత్ - ఫ్రాన్సు మధ్య 12 బిలియన్ యూరోల వ్యాపార లక్ష్యం ఏర్పాటు చేసుకున్నట్టు చెప్పారు. భారత్ తో కీలకమైన ఒప్పందాలను కుదుర్చుకున్నామని ఫ్రాన్సు అధ్యక్షుడు నికోలస్ సర్కోజీ అన్నారు. ఈ ఒప్పందం అత్యంత కీలకమైనదని ఆయన చెప్పారు.
కాగా ఫ్రాన్సులోని ముఖ్యమైన అణు ఇంధన అరెవా ఎస్ఏ అనే సంస్థ భారత్ లో 1650 మెగావాట్ల సామర్థ్యంగల ఐరోపా రియాక్టర్ ను రెండింటిని నెలకెల్పేందుకు ముందుకు వచ్చింది. మహారాష్ట్రలోని జైతాపూర్ లో వీటీని నెలకొల్పనున్నారు. భారత్ మొత్తం 20 అణు పరిశ్రమలు నెలకొల్పాలని సంకల్పించింది. అందులో ఈ రెండూ ఉన్నాయి. ఇరు దేశాలు మేధో సంపత్తి హక్కుల ఒప్పందంపై కూడా సంతకాలు చేశాయి.












Click it and Unblock the Notifications