కాంగ్రెసు ఎంపి రాయపాటి సాంబశివరావుతో వైయస్ జగన్ చర్చలు

అంబటి రాంబాబు తాము వ్యక్తిగత విషయాలు మాత్రమే మాట్లాడుకున్నామని, ఓ పెళ్లి గురించి మాట్లాడుకున్నామని శ్రీనివాస్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. గుంటూరు జిల్లా కాంగ్రెసు రాజకీయాల్లో మంత్రి కన్నా లక్ష్మినారాయణకు, రాయపాటి సాంబశివరావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కోట్లాది రూపాయల కన్నా లక్ష్మినారాయణ అక్రమార్జనపై విచారణ జరిపించాలని రాయపాటి సాంబశివరావు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన కన్నాను మంత్రివర్గంలోకి తీసుకోవద్దని కూడా ఆయన సూచించారు. అయితే, రాయపాటి మాటలను పట్టించుకోకుండా కన్నా లక్ష్మినారాయణకు మంత్రి పదవి ఇచ్చారు. దీంతో రాయపాటి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఆ నిరాశతోనే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన ప్రకటించినట్లు భావిస్తున్నారు. రాయపాటి సాంబశివరావు వైయస్ జగన్ తో వెళ్తే గుంటూరు జిల్లాలో కాంగ్రెసుకు తీవ్ర నష్టమే జరుగుతుంది.












Click it and Unblock the Notifications