విశాఖ కోర్టులో ఈనాడు అధినేత రామోజీరావుకు చుక్కెదురు

Ramoji Rao
విశాఖపట్నం: ఈనాడు గ్రూపు సంస్థల యజమాని రామోజీరావుకు కోర్టులో చుక్కెదురయింది. కోర్టుకు హాజరు కాకుండా మినహాయింపు ఇవ్వాలని రామోజీరావు, ఉషోదయ పబ్లికేషన్స్, ఈనాడు మేనేజింగ్ డెరైక్టర్ సీహెచ్ కిరణ్‌లు దాఖలు చేసుకున్న పిటిషన్లను సోమవారం విశాఖపట్నం నాలుగో అదనపు ప్రధాన మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు డిస్మిస్ చేసింది. రామోజీరావుతో పాటు మరో ఇద్దరు కోర్టుకు హాజరు కావాలని ఆదేశిస్తూ, కేసు తదుపరి విచారణ నిమిత్తం 2011 ఫిబ్రవరి 18వ తేదీకి వాయిదా వేశారు.

రామోజీరావు 1974 ఏప్రిల్ 1వ తేదీన విశాఖలోని సీతమ్మధార సర్వేనంబర్ 50/4లోని 2.78 ఎకరాల స్థలాన్ని ఉషోదయా పబ్లికేషన్స్‌కోసం మంతెన ఆదిత్య వర్మ నుంచి లీజుకు తీసుకున్నారు. రోడు విస్తరణలో భాగంగా అందులో కొంత స్థలాన్ని 1984లో ప్రభుత్వం తీసుకుంది. అప్పుడు రామోజీ ప్రభుత్వానికి తప్పుడు పత్రాలను సమర్పించి ప్రతిఫలంగా తనపేర కొంత స్థలాన్ని పొందారు. దీంతో స్థల యజమాని వర్మ తన ప్రమేయం లేకుండా ఆస్తిని స్వాహా చేసి మోసం చేసినట్లు 2008లో కోర్టులో కేసు వేశారు. ఆ కేసును ప్రాథమిక విచారణ నిమిత్తం త్రీటౌన్ పోలీసులకు సిఫార్సు చేశారు.

పోలీసులు సమగ్ర విచారణ జరిపి స్థల యజమాని వర్మను రామోజీ మోసం చేసినట్లు నిర్ధారించి కోర్టుకు నివేదిక పంపించారు. కోర్టు రామోజీ, మరో ఇద్దరిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 409, 417, 418,420, 423, 427 కింద క్రిమినల్ కేసు నమోదు చేసి వారెంట్ జారీ చేసింది. ఈ కేసులో రామోజీ, ఉషోదయ ఎంటర్‌ప్రైజస్ మేనేజింగ్ డెరైక్టర్, ఈనాడు మేనేజింగ్ డెరైక్టర్ సీహెచ్ కిరణ్‌లు కోర్టుకు హాజరు కాకుండా వ్యక్తిగత మినహాయింపు కోరుతూ గత నెల 2వ తేదీన పిటిషన్లు దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి... రామోజీరావు పిటిషన్లను తిరస్కరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+